Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏసీబీ వలలో హిందూపురం సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్

అనంతపురం జిల్లా హిందూపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అరుణకుమారి శనివారం ఏసీబీకి చిక్కారు. యూనిఫాం కాంట్రాక్టర్ నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. లంచం సొమ్ము స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

More Telugu News